మురుగదాస్ సినిమాలో విలన్ గా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు

మురుగదాస్ సినిమాలో విలన్ గా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు

Published on Feb 11, 2015 4:52 PM IST

anurag-murugadoss
ప్రముఖ హిందీ దర్శకుడు, రచయిత, నిర్మాత కరణ్ జోహార్ ‘బోంబే వెల్వెట్’ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి దర్శకుడు. ముంబై మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో అనురాగ్ కశ్యప్ సైతం విలన్ పాత్రలో కనిపించనున్నారట.

ఏఅర్ మురగదాస్ దర్శకత్వంలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో భోజపురీ ఇన్స్పెక్టర్ పాత్రలో అనురాగ్ కశ్యప్ నటించనున్నారట. అతని ఆహార్యం(గెటప్) ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వార్తను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ‘గజినీ’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన ఆర్.డి.రాజశేఖర్, ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ భాద్యతలు నిర్వర్తిస్తారు. మార్చి నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

తాజా వార్తలు