మరో బిగ్ ప్రాజెక్ట్ లో చాన్స్ కొట్టేసిన సమంత

మరో బిగ్ ప్రాజెక్ట్ లో చాన్స్ కొట్టేసిన సమంత

Published on Feb 15, 2015 3:08 PM IST

samantha
తెలుగు సినిమాల్లో క్వీన్ గా, టాప్ హీరోయిన్స్ లో ఒకరు వెలుగొందుతున్న హీరోయిన్ సమంత. ప్రస్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటోంది. ఇప్పటికే విజయ్, సూర్యలతో కలిసి చేసిన సమంత ప్రస్తుతం విక్రమ్ సరసన ’10 ఎంద్రాకుల్ల’ అనే ఓ రోడ్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఇది పూర్తి కాకముందే సూర్యతో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇది వరకే తెలియజేశాం. మనం ఫేం విక్రమ్ కుమార్ ఈ సినిమాకి డైరెక్టర్.

ఇదిలా ఉంటె గత ఏడాది సమంత, విజయ్ తో చేసిన కత్తి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మళ్ళీ సమంతకి విజయ్ సరసన మరో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఎఆర్ మురుగదాస్ నిర్మాతగా తన అసిస్టెంట్ అట్లీ డైరెక్ట్ చేయనున్న సినిమాలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా ఎంపికైంది. అట్లీ రాజా రాణి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ రెండు సినిమాల సెట్స్ లో అడుగు పెట్టేందుకు సమంత చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

తాజా వార్తలు