
అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా పరిచయమవుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. పూర్తి స్థాయి కథానాయకుడిగా అఖిల్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ స్పాట్ (లొకేషన్)లో దర్శకుడు, యూనిట్ సభ్యులు తనను ట్రీట్ చేస్తున్న విధానం పట్ల అఖిల్ సంతోషంగా ఉన్నాడు.
‘రామోజీ ఫిల్మ్ సిటీలో ఫస్ట్ షెడ్యూల్ గొప్పగా జరుగుతుంది. వినయ్ గారు నన్ను రాకుమారుడిలా (ప్రిన్స్) ట్రీట్ చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో నటించడం నా అదృష్టం’ అని అఖిల్ ట్వీట్ చేశారు.
అఖిల్ సరసన సాయేష సైగల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెకు కూడా ఇదే మొదటి సినిమా. వెలిగొండ శ్రీనివాస్ ఈ సినిమాకు కథ అందించగా కోన వెంకట్ మాటలు రాస్తున్నారు. సుధాకర్ రెడ్డి, నితిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్, అనూప్ రూబెన్స్ సంగీత దర్శకులు.
My first schedule in ramoji film city is going great. Vinay garu is treating me like a prince I’m so lucky to have him as my director !
— Akhil Akkineni (@AkhilAkkineni8) February 17, 2015

