
‘టెంపర్’ విజయం తరువాత దర్శకుడు తదుపరి చిత్రం లేడీ ఓరియెంటెడ్ గా ప్లాన్ చేసుకున్నాడు. ఛార్మీ ప్రధానపాత్రలో ‘జ్యోతిలక్ష్మి’ అనే సినిమాను తీయనున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చ్ 1 నుండి ప్రారంభంకానుంది.
ఈ సినిమాను సీ.కె ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మరియు శుభ శ్వేత ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గాయకుడి నుండి సంగీతదర్శకుడుగా అవతారమెత్తిన సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి స్వరాలను అందిస్తున్నాడు. పి.జి విందా సినిమాటోగ్రాఫర్.

