తెలుగు ‘బెంగళూర్ డేస్’ స్టార్ట్ అయ్యేదెప్పుడు?

తెలుగు ‘బెంగళూర్ డేస్’ స్టార్ట్ అయ్యేదెప్పుడు?

Published on Apr 8, 2015 8:18 AM IST

Bangalore-Days
గత సంవత్సరం మళయాలంలో విడుదలై సంచల విజయం సాధించిన చిత్రం ‘బెంగళూరు డేస్’. ‘ఓకే బంగారం’తో తెలుగు తెరకు పరిచయం కానున్న దుల్కర్ సల్మాన్‌తో పాటు నివిన్, నాజ్రియా తదితరులు నటించిన ఈ చిత్రం గత సంవత్సరం విడుదలైన సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్న విషయం తెలిసిందే. తమిళంలో ఈ సినిమాను పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా నిన్నే ప్రారంభమైంది. తమిళ వర్షన్లో ఆర్య, రానా, బాబీ సింహాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే తెలుగు రీమేక్ మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికున్న సమాచారం మేరకు తెలుగు రీమేక్‌కి ‘ఓ మై ఫ్రెండ్’ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. శర్వానంద్, వరుణ్ తేజ్, అవసరాల శ్రీనివాస్ లు హీరోలుగా నటించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా ఏదీ బయటకు కాలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు