సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘శ్రీ మంతుడు'(వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాని జూలైలో రిలీజ్ చెయ్యాలని ముందుగా ప్లాన్ చేసుకొని జూలై 17వ తేదీని ఈ సినిమా రిలీజ్ కోసం లాక్ చేసారు. కానీ గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో పెండింగ్ వర్క్ ఇంకా చాలా ఉండండం వలన ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మహేష్ బాబు మాత్రం అనుకున్న తేదీకే రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు.
ఈ విషయంపై మహేష్ బాబు ఇప్పటికే ఈ చిత్ర నిర్మాతలైన మైత్రి మూవీస్ వారితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 17న సినిమా రిలీజ్ చేయాల్సిందే అని కూడా చెప్పారు. ఇటీవలే మలేషియాలో ఓ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. మహేష్ బాబు సరసన మొదటి సారి శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిర్చి ఫేం కొరటాల శివ దర్శకుడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.


