మరణించిన ఎన్.టి.ఆర్ అభిమాని శ్రీనిధి

మరణించిన ఎన్.టి.ఆర్ అభిమాని శ్రీనిధి

Published on May 20, 2015 11:14 AM IST

ntr-fan-srinidhi-died

తమని అభిమానించే అభిమానుల కోసం ఏం చెయ్యడానికైనా సిద్దంగా ఉంటారు స్టార్ హీరోస్.. అలాంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ముందు ఉంటారు.. కొద్ది రోజుల క్రితమే ఎన్.టి.ఆర్ తనను ఎంతగానో ఇష్టపడే శ్రీనిధి అనే పేరుగల ఓ పదేళ్ళ పాప క్యాన్సర్‌తో బాధపడుతోందని, మరి కొద్ది రోజుల్లో చనిపోతుందని తెలుసుకున్నాడు. తన చివరి కోరిక ఎన్.టి.ఆర్ ని చూడడమే అని తెలుసుకున్న ఎన్.టి.ఆర్ ఆ చిన్నారి కోరికను తీర్చాడు. కూకట్‌పల్లిలోని రాందేవ్ హాస్పిటల్‌ కి వెళ్లి శ్రీనిధిని కలిసి, పరామర్శించి వచ్చాడన్న సంగతి అందరికీ తెలిసిందే.

తాజాగా ఓ బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది, అదే లాస్ట్ స్టేజ్ బ్లడ్ కాన్సర్ తో బాధపడుతున్న శ్రీ నిధి మంగళవారం రాత్రి కన్ను మూసింది. చిన్నారి మృతదేహాన్ని ఆమె స్వస్థలమైన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధనపల్లికి తరలించారు. శ్రీ నిధి మరణంతో ఆమె తల్లితండ్రులు శివాజీ, క్రాంతికుమారిలు శోఖ సముద్రంలో మునిగిపోయారు. శ్రీనిధికి మరో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఎన్.టి. ఆర్ అభిమానులంతా శ్రీనిధి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

తాజా వార్తలు