ఎన్.టి.ఆర్ సినిమాలో భాగస్వామి అయిన రిలయన్స్

ఎన్.టి.ఆర్ సినిమాలో భాగస్వామి అయిన రిలయన్స్

Published on May 20, 2015 3:12 PM IST

Jr_NTR

ఈ ఏడాది ‘టెంపర్’ సినిమా హిట్ అవ్వడం, ఆ తర్వాత ఇంటికి వారసుడు రావడంతో నందమూరి యంగ్ హీరో ఎన్.టి.ఆర్ చాలా ఆనందంగా ఉన్నాడు. టెంపర్ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఎన్.టి.ఆర్ సుకుమార్ తో తన తదుపరి సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రొడక్షన్ లోకి రియలన్స్ ఎంటర్టైన్మెంట్ వారు కూడా భాగస్వాములయ్యారు. ఇప్పుడు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుంది.

బివిఎస్ఎన్ ప్రసాద్ ఇది వరకూ చేసిన సాహసం, అత్తారింటికి దారేది సినిమాలకి కూడా రిలయన్స్ వారు సమర్పకులుగా వ్యవహరించారు. ఎన్.టి.ఆర్ సినిమా నిర్మాతల లిస్టులో మొదట బివిఎస్ఎన్ ప్రసాద్ మాత్రమే ఉన్నాడు, కానీ తాజాగా రిలయన్స్ వారు వచ్చి చేరారు. ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే లండన్ లో ప్రారంభం కానుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకి ‘మా నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

తాజా వార్తలు