అంకిత్ తివారి.. హిందీ సినిమా పాటల మాయలో పడిపోయిన వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ‘ఆషికి 2’, ‘ఏక్ విలన్’ సినిమాల ద్వారా బాలీవుడ్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అంకిత్ తివారి హైద్రాబాద్‌లో ఓ లైవ్ కాన్సర్ట్ ద్వారా మనల్ని అలరించేందుకు సిద్ధమైపోయారు. లివ్ ఇన్ మ్యూజిక్, ఆర్. సి. క్రియేషన్స్ కంటోనెంట్ అండ్ క్రియేటివ్ హెడ్ సంయుక్తంగా ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాయి.
ఈనెల 23న సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో అంకిత్ తివారి లైవ్ కాన్సర్ట్ జరగనుంది. అంకిత్ తివారి పాడిన పాటలు, ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమా పాటల లైవ్ పర్ఫామెన్స్తో అభిమానులను ఉర్రూతలూగించేందుకు అంకిత్ అన్డ్ టీమ్ ఇప్పటికే సిద్ధమైపోయారు. బుక్ మై షో ద్వారా ఈ ఈవెంట్‌కు టికెట్లు పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు.


