
ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకోవడంలో, సినిమా సినిమాకి సరికొత్త పాత్రలు ట్రై చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న యంగ్ హీరో నారా రోహిత్. ఈ యువ హీరో నటించిన మరో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘అసుర’. అసున ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతోంది. ఈ చిత్ర టీం ఈ సినిమా విజయం పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఓ థ్రిల్లర్ కథాశం తో రూపొందిన ఈ సినిమాలో వచ్చే సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని కచ్చితంగా థ్రిల్ చేస్తాయని అంటున్నారు.
ఈ చిత్ర టీం నుంచే కాకుండా ఫిల్మ్ నగర్లో కూడా ఈ సినిమాకి సూపర్బ్ రిపోర్ట్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన కొంతమంది నారా రోహిత్ చేతిలో పక్కా హిట్ మెటీరియల్ ఉందని అంటున్నారు. ఈ మూవీ ట్రైలర్ కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. మే 25న ఈ చిత్ర టీం అసుర ని సెన్సార్ కార్యక్రమాల కోసం పంపనున్నారు. కృష్ణ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా బెనర్జీ హీరోయిన్. జేమ్స్ మధు, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాని నారా రోహిత్ సమర్పణలో శ్యామ్ దేవభక్తుని ఈ సినిమాను నిర్మించారు.

