
సినీ ఇండస్ట్రీలో ఒక ఫార్మాట్ సినిమా హిట్ అయ్యింది అంటే, ఇక అదే ఫార్మాట్ లో సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో బాగా క్లిక్ అయిన జానర్ హర్రర్ కామెడీ. గత ఏడాది అంజలి, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలలో వచ్చిన సినిమా ‘గీతాంజలి’. బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు ఇదే సినిమాకి సీక్వెల్ గా ‘త్రిపుర’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ ని పోషిస్తోంది. స్వాతి ఈ సినిమా చేయడంతో ఈ సినిమా నిర్మాతలకి పెద్ద ప్లస్ అయ్యిందనే చెప్పాలి.
ఎలా అంటే.. స్వాతికి తెలుగులో కంటే ఎక్కువగా తమిళంలో క్రేజ్ ఉంది. అందుకే ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాని తమిళంలో కూడా ఒకేసారి డబ్ చేసి రిలీజ్ చేసి స్వాతికి ఉన్న ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఆ ప్లాన్ ప్రకారమే తమిళ వెర్షన్ కి సంబందించిన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. గీతాంజలి సినిమాలానే ఈ సినిమాకి కథకి మరియు సహా నిర్మాతగా ప్రముఖ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో కథని మలుపు తిప్పే ఓ కీ రోల్ లో యంగ్ హీరో నవీన్ చంద్ర కనిపించనున్నాడు. చినబాబు – రాజశేఖర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి కూడా గీతాంజలికి దర్శకుడైన రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

