
యువ నటి స్వాతి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చాలా ప్రయత్నిస్తుంది. నిఖిల్ తో నటించిన ‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ చిత్రాల విజయం తర్వాత తమిళ మరియు మలయాళం చిత్రాలలో నటించేందుకు ఒప్పదం కుదుర్చుకుంది. ప్రస్తుతం రెండు భాషల్లో నిర్మిస్తున్న మహిళా ప్రధాన చిత్రం ‘త్రిపుర’ షూటింగ్ లో పాల్గొంటుంది.
ప్రస్తుతం ఈ చిత్రంలోని ముఖ్యమైన సన్నివేశాలు బేగుంపేట లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం లో ముఖ్య పాత్ర పోషిస్తున్న నవీన్ చంద్ర కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. బేగంపేట లో షూటింగ్ ఇంకో రెండు రోజులు సాగనుంది.
అంజలి నటించిన ‘గీతంజలి’ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజ్ కిరణ్ ఈ చిత్రానికి దర్శకుడు. కోన వెంకట్ స్క్రీన్ ప్లే సహకారం అందిస్తున్నారు.

