సాయి ధరమ్ తేజ్ తో ‘పటాస్’ డైరెక్టర్ మూవీ

సాయి ధరమ్ తేజ్ తో ‘పటాస్’ డైరెక్టర్ మూవీ

Published on Jun 16, 2015 5:45 PM IST

Sai-Anil-Ravipudi
పవర్ఫుల్ పోలీస్ స్టొరీ ‘పటాస్’ సినిమాతో నందమూరి కళ్యాణ్ రామ్ కి కావాల్సిన అసలైన బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. అనిల్ కి మొదటి సినిమా అయినా ‘పటాస్’ తో తన టాలెంట్ ని పూర్తి స్థాయిలో నిరూపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అనిల్ రావిపూడి తన రెండవ సినిమాతో మరో స్టార్ ప్రొడక్షన్ బ్యానర్ లో సినిమా చేసే అవకాశం కొట్టేయడమే కాకుండా సెకండ్ సినిమాతో మెగా కాంపౌండ్ హీరోని కూడా డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేసాడు.

ఇక విషయంలోకి వస్తే.. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయనున్న రెండవ సినిమాలో హీరోగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ని ఖరారు చేసారు. అలాగే ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించనున్నాడు. సాయి ధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా అనిల్ ఈ సినిమా కథని రెడీ చేసాడని సమాచారం. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ దిల్ రాజు బ్యానర్ లోనే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే అనిల్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడుతుంది.

తాజా వార్తలు