సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఒకే ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఒక్క అవకాశం వచ్చినప్పుడు అందరినీ తన వైపు తిప్పుకునేలా చేయగలిగితే అతని కెరీర్ కి ఇక తిరుగు ఉండదు అనే విషయాన్ని ఇప్పటికే చాలా మంది ప్రూవ్ చేసారు. ఇలా వచ్చిన అవకాశాన్ని సూపర్బ్ గా ఉపయోగించుకున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్. మొదటి సినిమా ‘3’ లో కంపోజ్ చేసిన కొలవెరి డీ సాంగ్ తో వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన ఈ యంగ్ మ్యూజిక్ కంపోజర్ కి ధనుష్ అవకాశం ఇచ్చాడు. ఆ ఒక్క సాంగ్ తో సూపర్బ్ క్రేజ్ తెచ్చుకున్న అనిరుధ్ రవిచంద్రన్ ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరోస్ కి మ్యూజిక్ చేస్తున్నాడు.
ఇది పక్కన పెడితే అనిరుధ్ ధనుష్ తో కలిసి ఇప్పటి వరకూ రెండు సినిమాలకి పనిచేసాడు. అవే 3 మరియు వేలఇళ్ళ పట్టదారి(తెలుగులో రఘువరన్ బిటెక్). విఐపి సినిమా సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది. ఈ రెండు సూపర్ హిట్స్ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘మారి’. ఇటీవలే విడుదలైన ఈ మూవీ మ్యూజిక్ ఆల్బం కూడా తమిళంలో పెద్ద హిట్ అయ్యింది. తమిళ వర్గాలు అనిరుధ్ – ధనుష్ కలిసి హ్యాట్రిక్ కొట్టారని చెబుతున్నారు.


