
‘ప్రేమకథా చిత్రమ్’ సక్సెస్ తర్వాత యంగ్ హీరో సుధీర్ బాబు – నందిత జంటగా రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన సినిమా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘ఛార్మినార్’ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విమర్శకుల నుంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా కితాబులందుకున్న ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి కూడా మనసుకు హత్తుకునే ప్రేమకథా చిత్రమని టాక్ వస్తోంది. రోజు రోజుకీ ఈ సినిమా మంచి మౌత్ టాక్ వస్తోంది.
రిలీజ్ అయిన రెండు మూడు రోజుల్లో ప్రేక్షకుల మౌత్ పబ్లిసిటీ వల్ల ఈ సినిమాకి వస్తున్న క్రౌడ్ మరింత పెరుగుతోంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకి బాగా నచ్చుతుండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి వస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. వీక్ డే అయిన నిన్న కూడా ఈ సినిమాకి స్టడీ కలెక్షన్స్ వచ్చాయి. దానికి కారణం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడమే అని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. ఈ మౌత్ టాక్ వల్లే ఈ సినిమా థియేటర్స్ ని కూడా పెంచారు. ఆర్ చంద్రు ఈ సినిమాకి డైరెక్టర్.

