మరో టాప్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా తాప్సీ!

మరో టాప్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా తాప్సీ!

Published on Jun 24, 2015 7:58 PM IST

taapsee
గత కొంతకాలంగా కేవలం నటిగా తానేంటో నిరూపించుకునే పాత్రలనే ఎంపిక చేసుకుంటూ వెళుతున్న తాప్సీ, ఆ పాత్రలతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించింది. ఈ కోవలో ఆమె నటించిన బాలీవుడ్ సినిమా ‘బేబీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడమే కాక తాప్సీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ‘కాంచన 2’ తర్వాత తాప్సీ పేరు తెలుగు, తమిళ భాషల్లో మారుమోగిపోయింది.

‘బేబీ’, ‘కాంచన 2’ రెండు సినిమాల తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస అవకాశాలను సొంతం చేసుకుంటున్న తాప్సీ ఎండార్స్‌మెంట్ల విషయంలోనూ సత్తా చాటుతోంది. తాజాగా అతిపెద్ద మోటార్ వెహికిల్ కంపనీ అయిన ‘ది హోండా’కు దేశవ్యాప్తంగా తాప్సీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా సంతకం చేసింది. ప్రముఖ బాలీవుడ్ తారలను పక్కన పెట్టి తాప్సీకి ఈ అవకాశాన్ని సొంతం చేసుకోవడం నిజంగా విశేషమే! ప్రస్తుతం తాప్సీ మూడు నేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా కొనసాగుతూ ఎండార్స్‌మెంట్లలోనూ తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది!

తాజా వార్తలు