బాహుబలి ఏపి-తెలంగాణ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్

బాహుబలి ఏపి-తెలంగాణ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్

Published on Jul 16, 2015 9:06 PM IST

baahubali
కేవలం 4 రోజుల్లోనే తెలుగు చలన చిత్ర సీమ ఆల్ టైం రికార్డ్స్ ని బద్దలు కొట్టి నెంబర్ 1 స్థానంలో నిలబడిన సినిమా ‘బాహుబలి’. తెలుగు చలన చిత్ర దశ, దిశని మార్చి తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ రేంజ్ కి తీసుకెళ్ళి ప్రతి తెలుగువాడు గర్వపడేలా చేస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్. మునుపెన్నడూ చూడని భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్, హాలీవుడ్ ని తలపించే ఓ వార్ ఎపిసోడ్.. ఇలాంటివన్నీ ఆడియన్స్ ని రంజింపజేస్తున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు.

ప్రీమియర్ షోస్ నుంచే ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. తాజాగా అందిన ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం కేవలం ఆంధ్ర – తెలంగాణలతో కలుపుకొని కేవలం 5 రోజుల్లో బాహుబలి సినిమా 50 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. మొదటి వారం పూర్తయ్యే టైంకి ఇరు రాష్ట్రాల్లో 60 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాహుబలి మొదటి 6 రోజుల్లో ఆంధ్ర, తెలంగాణలో ఏరియా వైజ్ కలెక్ట్ చేసిన షేర్ వివరాలతో పాటు మొదటి 6 రోజుల్లో కర్ణాటకలో కలెక్ట్ చేసిన షేర్ వివరాలను కూడా మీకందిస్తున్నాం..

ఏరియా
కలెక్షన్స్(షేర్)
నైజాం   20.64 కోట్లు
సీడెడ్ 11.50 కోట్లు
నెల్లూరు   2.12 కోట్లు
గుంటూరు 5.17 కోట్లు
కృష్ణా 3.43 కోట్లు
పశ్చిమ గోదావరి 4.30 కోట్లు
తూర్పు గోదావరి  4.88 కోట్లు
వైజాగ్ 5.07 కోట్లు
ఏపి,టిజి మొత్తం 57.11 కోట్లు
కర్ణాటక     18.69 కోట్లు
మొత్తం     75.80 కోట్లు

తాజా వార్తలు