
కేవలం 4 రోజుల్లోనే తెలుగు చలన చిత్ర సీమ ఆల్ టైం రికార్డ్స్ ని బద్దలు కొట్టి నెంబర్ 1 స్థానంలో నిలబడిన సినిమా ‘బాహుబలి’. తెలుగు చలన చిత్ర దశ, దిశని మార్చి తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ రేంజ్ కి తీసుకెళ్ళి ప్రతి తెలుగువాడు గర్వపడేలా చేస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్. మునుపెన్నడూ చూడని భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్, హాలీవుడ్ ని తలపించే ఓ వార్ ఎపిసోడ్.. ఇలాంటివన్నీ ఆడియన్స్ ని రంజింపజేస్తున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు.
ప్రీమియర్ షోస్ నుంచే ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. తాజాగా అందిన ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం కేవలం ఆంధ్ర – తెలంగాణలతో కలుపుకొని కేవలం 5 రోజుల్లో బాహుబలి సినిమా 50 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. మొదటి వారం పూర్తయ్యే టైంకి ఇరు రాష్ట్రాల్లో 60 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాహుబలి మొదటి 6 రోజుల్లో ఆంధ్ర, తెలంగాణలో ఏరియా వైజ్ కలెక్ట్ చేసిన షేర్ వివరాలతో పాటు మొదటి 6 రోజుల్లో కర్ణాటకలో కలెక్ట్ చేసిన షేర్ వివరాలను కూడా మీకందిస్తున్నాం..
| ఏరియా |
కలెక్షన్స్(షేర్) |
| నైజాం | 20.64 కోట్లు |
| సీడెడ్ | 11.50 కోట్లు |
| నెల్లూరు | 2.12 కోట్లు |
| గుంటూరు | 5.17 కోట్లు |
| కృష్ణా | 3.43 కోట్లు |
| పశ్చిమ గోదావరి | 4.30 కోట్లు |
| తూర్పు గోదావరి | 4.88 కోట్లు |
| వైజాగ్ | 5.07 కోట్లు |
| ఏపి,టిజి మొత్తం | 57.11 కోట్లు |
| కర్ణాటక | 18.69 కోట్లు |
| మొత్తం | 75.80 కోట్లు |

