హెలీ పాడ్ వద్ద విలన్స్ పని పడుతున్న ‘బ్రూస్ లీ’

హెలీ పాడ్ వద్ద విలన్స్ పని పడుతున్న ‘బ్రూస్ లీ’

Published on Sep 10, 2015 8:39 AM IST

Ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 9వ సినిమా ‘బ్రూస్ లీ’ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ‘ది ఫైటర్’ అనే ఈ సినిమాకి ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్ కి ట్యాగ్ లైన్ కి తగ్గట్టుగానే ఫైట్లు చేయడంలో, విలన్స్ పని పట్టడంలో మంచి దిట్ట. అలాంటి యంగ్ అండ్ డైనమిక్ కుర్రాడు బ్రూస్ లీ పై ప్రస్తుతం ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ లో రామ్ చరణ్ పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ ని ఇటీవలే అన్నపూర్ణ 7 ఎకర్స్ లో షూట్ చేసారు. రెండు రోజులు సాంగ్ ని షూట్ చేసిన ఈ చిత్ర టీం సాంగ్ షూట్ కి బ్రేక్ ఇచ్చి ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయడం కోసం రామోజీ ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ అయ్యారు.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలోని హెలీ పాడ్ వద్ద రామ్ చరణ్ – విలన్స్ పై వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ని వెంకట్ మాస్టర్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ యాక్షన్ ఎపిసోడ్ తో 85% టాకీ పార్ట్ పూర్తవుతుంది. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా సెట్లో జాయిన్ కానున్నాడు. ప్రస్తుతం తమన్ చిరంజీవి కోసం ఓ స్పెషల్ సాంగ్ ని కంపోజ్క్ హేసే పనిలో ఉన్నాడు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కృతి కర్భంద, నదియా, రావు రమేష్, సంపత్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ చివర్లో ఆడియోని రిలీజ్ చేసి సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు