‘భలే భలే మగాడివోయ్’ రీమేక్‌కు క్రేజీ ఆఫర్స్!

‘భలే భలే మగాడివోయ్’ రీమేక్‌కు క్రేజీ ఆఫర్స్!

Published on Sep 13, 2015 10:44 AM IST

Bhale-Bhale-Magadivoi

‘భలే భలే మగాడివోయ్’.. నాని హీరోగా, చిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి రూపొందించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్నిచోట్లా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. మంచి హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఏ సెంటర్స్, ఓవర్సీస్‌లో ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ తెచ్చిపెడుతోంది. ఓవర్సీస్‌లో మిడిల్ లెవెల్ బడ్జెట్ సినిమాల్లో 1 మిలియన్ సాధించిన సినిమాగా ‘భలే భలే మగాడివోయ్’ ఓ సరికొత్త రికార్డు సృష్టించింది.

ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు, ఆయా ఇండస్ట్రీల్లోని పెద్ద సంస్థలు పోటీపడుతున్నాయి. ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో, మంచి కామెడీ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా అన్ని భాషలకూ కనెక్ట్ అయ్యే తరహా సినిమా కావడంతో సాధారణంగానే అన్ని భాషల నుండి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. భలే భలే మగాడివోయ్ సినిమాను నిర్మించిన గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ గీతా ఆర్ట్స్ 2‌ను పలు పెద్ద సంస్థలు బాలీవుడ్, కోలీవుడ్ రీమేక్‌కు సంప్రదిస్తున్నాయని తెలుస్తోంది. అయితే గతంలో బాలీవుడ్‌లో గజనీ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను అందించిన గీతా ఆర్ట్స్, భలే భలే మగాడివోయ్‌ని స్వయంగా నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు