మహేష్‌ను అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు

మహేష్‌ను అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు

Published on Sep 14, 2015 10:06 AM IST

mahesh-babu-chandra-babu
‘శ్రీమంతుడు’.. సూపర్ స్టార్ మహేష్ హీరోగా, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ సినిమా. ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేయడమే కాక, పలువురు రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖుల మన్ననలు కూడా అందుకొని హీరో మహేష్, దర్శకుడు కొరటాల శివకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఊరిని దత్తత తీసుకొని బాగుపరచడమనే ఓ సోషల్ మెసేజ్‌తో ముడిపడి ఉన్న సినిమా తీసినందుకు ఇప్పటికే వెంకయ్య నాయుడు, కేటీఆర్ లాంటి రాజకీయ ప్రముఖులు మహేష్‌ను కొనియాడిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేరిపోయారు. ‘శ్రీమంతుడు’ సినిమాను చూసిన తర్వాత ఆయన తన ట్విట్టర్ ఎకౌంట్‌ను వేదికగా చేసుకొని మహేష్‌ను అభినందించారు. “మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమా చూశా. మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వడమనే విషయాన్ని చాలా బాగా చెప్పారు. స్మార్ట్ విలేజ్ అంటూ మనం చేపట్టిన కార్యక్రమాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంది” అంటూ తెలిపారు. ఇక చంద్రబాబు అభినందనలకు మహేష్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ థ్యాంక్స్ తెలిపారు. ఇక శ్రీమంతుడు సినిమాలో చూపినట్టుగానే నిజ జీవితంలోనూ మహేష్ ఏపీ, తెలంగాణాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకొని పలువురికి ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు