నాగార్జున – కార్తీ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే దానికి ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందనేది పీవీపీ సంస్థ నిర్మిస్తోన్న ‘ఊపిరి’ ఫస్ట్‌లుక్‌తో స్పష్టమైంది. తెలుగు, తమిళ భాషల్లో పెద్ద ఎత్తున రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఊపిరి’ సినిమాకు సంబంధించి ఈమధ్యే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌తో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
ఇప్పటికే క్రేజీ కాంబినేషన్, అనుష్క ఓ గెస్ట్ రోల్ చేయడం లాంటివి ఈ సినిమా విషయంలో ఆసక్తికరంగా కనిపించగా, వీరితో పాటు తాజాగా మరో యువహీరో కూడా ఈ టీమ్‌లో జాయిన్ కానున్నారు. పంజా, దొంగాట సినిమాలతో మెప్పించిన అడవి శేష్, ఊపిరి సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేసేందుకు సిద్ధమయ్యారు. అనుష్క భర్తగా శేష్ ఈ సినిమాలో కనిపించనున్నారట. త్వరలోనే శేష్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. నాగార్జున, కార్తీ, తమన్నా, అనుష్క, శేష్.. ఇలా భారీ తారాగణమే కనిపించనున్న ఈ సినిమా సెలెబ్రేషన్ ఆఫ్ లైఫ్ అనే పేరుతో ఓ అద్భుతమైన కథతో మనముందుకు రానుందని తెలుస్తోంది.


