‘సుబ్రమణ్యం ఫర్ సేల్‌’కు మంచి ఓపెనింగ్స్

‘సుబ్రమణ్యం ఫర్ సేల్‌’కు మంచి ఓపెనింగ్స్

Published on Sep 24, 2015 8:10 PM IST

Subramanyam-for-Sale
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.. మెగా హీరో సాయిధరమ్ తేజ్, కమర్షియల్ హిట్స్‌తో టాప్ దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతగా తనదంటూ బ్రాండ్ సెట్ చేసిన దిల్‌రాజుల కలయికలో రూపొందిన కమర్షియల్ ఎంటర్‌టైనర్. లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఇలా అన్ని కమర్షియల్ అంశాల మేళవింపుతో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్స్‌తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగడంతో సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ఏపీ, తెలంగాణాల్లో పెద్ద ఎత్తున ఈ సినిమా విడుదలైంది.

ఇక విడుదలైన అన్నిచోట్లా ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. హరీష్ శంకర్ స్టైల్లో సాగే కామెడీ, సాయిధరమ్ తేజ్ ఈజ్ యాక్టింగ్, తేజ్-రెజీనాల కెమిస్ట్రీ ఇవన్నీ ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌గా నిలిచాయి. మొదట్నుంచీ క్రేజ్ ఉన్న సినిమా కావడం, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడం వంటి కారణాలతో మొదటి రోజు ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. ఇక శని, ఆదివారాల్లో ఈ కలెక్షన్స్ మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని ట్రేడ్ టాక్.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు