కమల్ హాసన్ పై తెలుగు హాట్ బ్యూటీ ప్రశంశలు

కమల్ హాసన్ పై తెలుగు హాట్ బ్యూటీ ప్రశంశలు

Published on Sep 25, 2015 5:00 PM IST

chikatirajyam

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి షూట్ చేసిన ఈ సినిమాకి తమిళంలో ‘తూంగావనం’ అనే టైటిల్ ని పెట్టారు. షూటింగ్ మొత్తం ఫినిష్ చేసిన ఈ చిత్ర టీం రీసెంట్ గా మరో స్పెషల్ ఎక్స్ట్రా యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసారు. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో తెలుగు హాట్ బ్యూటీ అయిన మధు శాలిని కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ కి వస్తున్నా రెస్పాన్స్ విషయంలో చాలా హ్యాపీగా ఉండడమే కాకుండా కమల్ పై ప్రశంశల జల్లు కురిపిస్తోంది ఈ హాట్ బ్యూటీ.

మధు శాలిని కమల్ తో నటించే డ్రీం నెరవేరినందుకు ఆనందపడుతూనే కమల్ తో పనిచేసిన తన అనుభవాన్ని మాతో పంచుకుంది. ‘క్రియేటివిటీ పరంగా ఒక సీన్ ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ పై చూపడంలో కమల్ హాసన్ ది బెస్ట్. కమల్ తో నటించాలనే నా డ్రీం, ఆయనతో కలిసి పనిచేసిన ప్రతి సెకన్ నా లైఫ్ లో మరచిపోలేని అనుభవం. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. యాక్టింగ్ పరంగా కానీ, టేక్నికాలిటీస్ పరంగా ఆయనకి ఉన్న నాలెడ్జ్ సింప్లీ సూపర్బ్ అని’ తెలిపింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాని దీపావళి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. త్రిష, ప్రకాష్ రాజ్ లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చినమాకి జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు