వరుణ్ తేజ్ ని దొంగగా మార్చిన పూరి

వరుణ్ తేజ్ ని దొంగగా మార్చిన పూరి

Published on Sep 28, 2015 11:43 AM IST

varun-and-puri
మెగా ఫ్యామిలీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు తనయుడిగా వరుణ్ తేజ్ గత ఏడాది తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. తన కెరీర్ ప్రారంభంలోనే ముకుంద, కంచె రూపంలో రెండు డిఫరెంట్ సినిమాలను చేసాడు. ఈ రెండిటి తర్వాత వరుణ్ తేజ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలిసి చేస్తున్న పక్కా మాస్ మసాలా ‘లోఫర్’. మరో 5 రోజులు మాత్రమే షూటింగ్ బాలన్స్ ఉన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర ఎలా ఉంటుంది అనే ఆసక్తికర విషయాన్ని మీకందిస్తున్నాం.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ దొంగగా కనిపిస్తాడు. తన అవసరాల కోసం ప్రజల జేబులు కొట్టేసి అందరి చేత వాడో పెద్ద లోఫర్ అనిపించుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేసే పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తాడు. ఇలా పక్కా దొంగగా ఉన్న కుర్రాడు ఇందుకోసం మంచిగా మారాడు అన్నదే స్టోరీ లైన్. పూర్తి మదర్ సెంటిమెంట్ తో రానున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి మదర్ గా అలనాటి విలక్షణ నటి రేవతి కనిపిస్తుంటే, పోసాని కృష్ణ మురళి ఫాదర్ గా కనిపించనున్నాడు. వరుణ్ తేజ్ కి జోడీగా దిశా పటాని కనిపించనున్న ఈ సినిమాకి సి కళ్యాణ్ నిర్మాత అయితే, సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ చిత్ర టీం ఈ సినిమా టైటిల్ ని మార్చే పనిలో ఉన్నారు, ఫైనల్ గా లోఫర్ అనే టైటిల్ కాకుండా వేరే టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు