
టాలీవుడ్ బాక్స్ ఆఫీసు దశ, దిశని మార్చడమే కాకుండా తెలుగు వారంతా గర్వంగా చెప్పుకునే హై టెక్నికల్ వాల్యూస్ తో, గ్రాండ్ విజువల్స్ తో అద్భుతమైన విజువల్ వండర్ గా వచ్చిన పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’. ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన ఈ బాహుబలిలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గేత్స్ బ్లాక్ బస్టర్ అయిన బాహుబలి శాటిలైట్ రైట్స్ ని మా టీవీ వారు సొంతం చేసుకున్నారు. వారు బుల్లి తెరపై ఫస్ట్ ప్రీమియర్ వెయ్యడానికి స్పెషల్ ప్లాన్ చేస్తున్నారు.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం బాహుబలి మొదటి ప్రీమియర్ షో అక్టోబర్ 25న మా టీవీలో ప్రసారం కానుంది. ఈ సినిమా టైంలో ఎక్కువగా ఈ సినిమా చూడాలని ముందు నుంచే బాహుబలి పై కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా చేయనున్నారు. అంతే కాకుండా బాహుబలి ప్రసారం అయ్యే ఒకరోజు ముందు మా టీవీ లో బాహుబలి పై రెండు గంటలు సాగే ఓ నాన్ స్టాప్ ప్రోగ్రాం ని ప్రసారం చేయనున్నారు. అ టైంలో ఇప్పటి వరకూ చూపించని కొన్ని మేకింగ్ సీన్స్ మరియు సెలబ్రిటీల ఇంటర్వ్యూ బిట్స్ ని ఇందులో చూపించనున్నారు. బుల్లితెర ప్రీమియర్ ని కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. దీని ప్రకారం టెలివిజన్ టి.ఆర్.పి రేటింగ్స్ లో కూడా బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఆశించవచ్చు.

