కళ్యాణ్ రామ్ ఆడియో లాంచ్ కి తారక్.!

కళ్యాణ్ రామ్ ఆడియో లాంచ్ కి తారక్.!

Published on Sep 29, 2015 4:51 PM IST

ntr-kalyan-ram-m
ఈ ఏడాది అటు మాస్ తో పాటు ఇటు క్లాస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకున్న పవర్ఫుల్ పోలీస్ ఎంటర్టైనర్ ‘పటాస్’ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్. చాలా రోజుల తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ కి ఓ సూపర్ హిట్ ఇచ్చిన సినిమా ఇది. దీంతో ఫుల్ ఫాంలోకి వచ్చిన కళ్యాణ్ రామ్ అప్పుడే తన తదుపరి సినిమా ‘షేర్’ షూటింగ్ ని పూర్తి చేసాడు. కళ్యాణ్ రామ్ సరసన హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాని అక్టోబర్ 30న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసారు.

అలాగే ఎస్ఎస్ తమన్ అందించిన ఆడియోని అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం షేర్ సినిమా ఆడియో లాంచ్ కి యంగ్ టైగర్ ఎన్.టి.అర్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నాడు. ఇటీవలే లండన్ షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చిన ఎన్.టి.ఆర్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాడు. దాంతో తనే ముఖ్య అతిధిగా హాజరు కానున్నాడు. కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాకి కూడా ఎన్.టి.ఆర్ వచ్చి కళ్యాణ్ రామ్ కి తన సపోర్ట్ ఇచ్చాడు. ఇప్పుడూ అదే తరహాలో అన్నకి సపోర్ట్ ఇవ్వనున్నాడు.

సినిమాలనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఓ డిఫరెంట్ పాయింట్ తో ఈ సినిమా ఉండనున్న ఈ సినిమాకి మల్లికార్జున్ దర్శకత్వం వహిస్తున్నాడు. కొమర వెంకటేష్ నిర్మిస్తున్న ‘షేర్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు