
టాలీవుడ్ లో కొతమంది దర్శకులు ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై చూడని కొన్ని ఆసక్తికరమైన కథలతో సినిమాలు చేస్తున్నారు. అలా క్రేజీ డైరెక్టర్ క్రిష్ వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ లో షూట్ చేసిన సినిమా ‘కంచె’. మునుపెన్నడూ తెలుగు స్క్రీన్ పై చూడని వార్ ఎపిసోడ్ తో తెరకెక్కిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా ఫినిష్ చేసుకొని ‘యు/ఏ’ సర్టిఫికేట్ తెచ్చుకుంది. మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమాని నవంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ కి ఓ సున్నితమైన ప్రేమకథని జోడించి చేసిన ఈ సినిమాలో అప్పటి రియల్ వరల్డ్ వార్ వెపన్స్ కూడా ఉపయోగించారని ఇది వరకే తెలియజేశాం.
అంతే కాకుండా ఈ సినిమా కోసం అప్పటిలో బాగా ఫేమస్ అయిన మల్లయుద్ధం(కుస్తీ) మరియు కర్రసాములలో హీరో వరుణ్ తేజ్ మరియు విలన్ నికేతన్ దీర్ లకు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. మల్ల యుద్దంలో అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. అందుకే అలనాటి మల్లయుద్ద వీరులను, అప్పటి మాస్టర్స్ ని పెట్టి సుమారు 10 రోజుల పాటు వరుణ్ తేజ్ మరియు విలన్ నికేతన్ దీర్ లకు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఈ మల్లయుద్ధం మీద వచ్చే సీన్స్ కొత్తగా ఉండడమే కాకుండా సినిమాకి హైలైట్ అవుతాయని ఈ చిత్ర టీం అంటోంది. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ1947 బ్యాక్ డ్రాప్ మూవీకి చిరంతన్ భట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు

