
తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి, ఈమధ్యే విడుదలైన ‘భలే భలే మగాడివోయ్’తో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయారు. నాని హీరోగా మారుతి రూపొందించిన భలే భలే మగాడివోయ్ సినిమా, దర్శకుడిగా మారుతి రేంజ్‌ను పెంచడంతో పాటు స్టార్‌డమ్‌ను కూడా తెచ్చిపెట్టింది. ఒక కొత్త కాన్సెప్ట్‌ను అన్నిరకాల ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా, క్లీన్ కామెడీతో తెరకెక్కించిన విధానానికి మారుతిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇక ఈ సినిమాతో టాప్ లీగ్‌లో చేరిపోయిన మారుతికి ప్రస్తుతం వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్యతో సినిమా చేసేందుకు మారుతి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం నాగచైతన్య గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సాహసం శ్వాసగా సాగిపో’, ‘ప్రేమమ్’ రీమేక్ ‘మజ్నూ’లతో బిజీగా ఉన్నారు. ఇక మారుతి దర్శకత్వంలో చైతూ నటించబోయే సినిమా ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత సెట్స్‌పైకి వెళుతుందని తెలుస్తోంది. అయితే ఈ కాంబినేషన్లో సినిమాపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదీ రాలేదు.

