‘బ్రహ్మోత్సవం’ ఇంట్రో సాంగ్ కోసం అంత ఖర్చా?

‘బ్రహ్మోత్సవం’ ఇంట్రో సాంగ్ కోసం అంత ఖర్చా?

Published on Oct 2, 2015 5:45 PM IST

Mahesh-Babu
‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్స్‌బస్టర్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి అందమైన కుటుంబ చిత్రాన్నిచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, మహేష్‍తో ‘బ్రహ్మోత్సవం’ కోసం మరోసారి జతకట్టారు. పీవీపీ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను రూపొందిస్తోంది. ఇక ఈమధ్యే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సాంగ్ షూట్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మరో షెడ్యూల్ జరుపుకోనుంది.

ఇదిలా ఉంటే.. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఇంట్రో సాంగ్‌కు బ్రహ్మోత్సవం టీమ్ భారీ ఎత్తున ఖర్చుపెట్టిందని తెలుస్తోంది. మనకు అందిన సమాచారం మేరకు మహేష్, ప్రణీత్, నరేష్, రావు రమేష్, జయసుధ, తులసి.. ఇలా భారీ తారాగణం పాల్గొనగా పెద్ద సెట్‌లో తెరకెక్కిన ఈ సాంగ్ కోసం 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. సంగీత్ సాంగ్‌గా, భారీ ఎత్తున తెరకెక్కిన ఈ సాంగ్ మహేష్ ఇంట్రో సాంగ్‌గా రానుందని తెలుస్తోంది. సమంత, కాజల్, ప్రణీత.. ఇలా ముగ్గురు హీరోయిన్లతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అనౌన్స్ అయిన రోజునుంచే మంచి ఆసక్తి కనిపిస్తూ వచ్చింది. ఇక ఈ సినిమా మహేష్ కెరీర్లో మరో గుర్తుండిపోయే ఒక సినిమాలా నిలబడుతుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు