ఇలియానా.. తెలుగు, తమిళంలో టాప్ స్టార్స్ సరసన నటించి ఆ తర్వాత బాలీవుడ్లో కూడా మెరిసిన స్టార్ హీరోయిన్. ఇప్పటివరకూ ఇండియన్ సినిమాకే పరి్మితమైన ఇలియానా, ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ సినిమాల హీరో జాకీచాన్‌తో కట్టనుండడం ఆసక్తికరంగా మారింది. జాకీచాన్ హీరోగా కుంగ్ ఫూ యోగా అనే సినిమా ఈమధ్యే మొదలైంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మొదట కత్రినా కైఫ్‌ను ఎంపిక చేశారు. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో కత్రినా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.
ఈ నేపథ్యంలోనే కత్రినా స్థానాన్ని ఇలియానా బర్తీ చేయనున్నారని సమాచారం. స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం దుబాయ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇలియానా కూడా త్వరలోనే ఈ సినిమా షెడ్యూల్లో జాయిన్ కానున్నారట. ఇక ఇప్పటికే నటుడు సోనూసూధ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, తాజాగా ఇలియానా హీరోయిన్గా చేయనుండడంతో కుంగ్ ఫూ యోగా ప్రాజెక్ట్ సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని సమాచారం.


