
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ సినిమా ప్రమోషన్స్ టైంలో ‘గజినీ’, ‘సెవెంత్ సెన్స్’, ‘తుపాకి’, ‘స్టాలిన్’, ‘కత్తి’ లాంటి సినిమాలు తీసి అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిన డైరెక్టర్ ఎఆర్ మురుగదాస్ తో ఓ సినిమా చేయాలనీ ఉందని చెప్పాడు. దాంతో వెంటనే తెలుగు నిర్మాతలు మురుగదాస్ తో సంప్రదింపులు జరిపి మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్ ని సెట్ చేసారు.
ఇటీవలే మురుగదాస్ మహేష్ బాబు ఇమేజ్ కి సరిపోయే పర్ఫెక్ట్ కమర్షియల్ కథని సిద్దం చేసిన విషయాన్ని మీకు తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర నిర్మాతలైన ఎన్.విప్రసాద్ – ఠాగూర్ మధులు ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ అనుకుంటున్నారట. ప్రొడక్షన్ టీం నుంచి తెలుసుకున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు – మురుగదాస్ సినిమాకి సుమారు 80 కోట్ల బడ్జెట్ అవుతుందట. మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ గా మురుగదాస్ సినిమానే టేకాఫ్ అవుతుందని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది మే లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

