‘రుద్రమదేవి’కి ఇండస్ట్రీ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్!

‘రుద్రమదేవి’కి ఇండస్ట్రీ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్!

Published on Oct 8, 2015 11:39 PM IST

Rudhramadevi
దర్శకుడు గుణశేఖర్ ఏళ్ళ తరపడి శ్రమించి తెరకెక్కించిన కలల ప్రాజెక్ట్ ‘రుద్రమదేవి’ మరో కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. భారతదేశపు మొట్టమొదటి 3డీ బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు, హిందీ, మళయాలంలో ఒకేసారి 2డీ, 3డీ వర్షన్స్‌లో రిలీజ్ కాబోతోంది. అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే అంతటా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మొదటి వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో సత్తా చాటి ఈ సినిమా టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారిపోయింది.

ఇక ఈ సినిమా పట్ల ప్రేక్షకులు, అభిమానులే కాక ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన తెలుగు ప్రాంత నేపథ్యంలో నడిచే చారిత్రక చిత్రం కావడంతో సాధారణంగానే అందరి కళ్ళూ ప్రస్తుతం ‘రుద్రమదేవి’పైనే ఉన్నాయి. ఇక పలువురు టాప్ స్టార్స్ సైతం ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుతూ ప్రచారం కల్పిస్తున్నారు. స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు రుద్రమదేవి మంచి విజయం సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచాలని కాంక్షిస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం రుద్రమదేవి సినిమాకు ట్యాక్స్‌ను మినహాయించి సినిమాకు మంచి సపోర్ట్ ఇవ్వడం ప్రస్తుతం విశేషంగా కనిపిస్తోంది.

తాజా వార్తలు