వినూత్న ప్రచార కార్యక్రమాలతో ‘కంచె’ టీమ్

వినూత్న ప్రచార కార్యక్రమాలతో ‘కంచె’ టీమ్

Published on Oct 9, 2015 5:30 PM IST

Kanche
‘కంచె’.. ఇండియన్ సినిమాలో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వస్తోన్న మొదటి సినిమా. విలక్షణ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ బ్రాండ్‌ను సెట్ చేసుకున్న క్రిష్, ఈ సినిమాతో మరోసారి సరికొత్తగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఈ మధ్యే హీరోగా ఎంట్రీ ఇచ్చి మెప్పించిన వరుణ్ తేజ్, తన రెండో సినిమా కంచెలో ఓ డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తూ ఆకట్టుకోనున్నారు. ఇప్పటికే సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా, నవంబర్‌ 6న విడుదల కానుంది.

ఇక సినిమా విడుదలకు నెలరోజుల ముందునుంచే ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. కంచె సినిమాకు సంబంధించిన ఆసక్తికర సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పంచుకుంటూ, కంచె టీమ్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇక తాజాగా వినూత్న ప్రచార కార్యక్రమాలతో కంచె టీమ్ మరింత దూకుడు పెంచి దూసుకుపోతోంది.

రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో నడిచే సినిమా కావడంతో ఈ నేపథ్యానికి సంబంధించిన వివరాలను, విశేషాలను, అప్పటి పరిస్థితులను సినిమాలో ఒడిసిపట్టారనే విషయాన్ని తెలుపుతూ కంచె టీమ్, కంచె మేకింగ్ డైరీ పేరుతో పుస్తకం విడుదల చేస్తోంది. ఈ పుస్తకంలో కంచె సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర సమాచారాన్ని పొందుపరిచారు. త్వరలోనే ఈ పుస్తకం మార్కెట్లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదలకు ముందు సరికొత్త ప్రచారాలతో మరింత క్రేజ్ తెచ్చుకుంటుందనే చెప్పొచ్చు.

తాజా వార్తలు