
‘బాహుబలి’ అనే ఒక్క సినిమాతో సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలోనూ బాగా ఫేమస్ అయిపోయిన హీరో రానా దగ్గుబాటి. బాహుబలి అనే సినిమా వచ్చి వెళ్ళిన 3 నెలల గ్యాప్ లోనే మరోసారి ‘రుద్రమదేవి’లో కనిపించిన రానా అందరినీ మరోసారి మెప్పించాడు. ఇదిలా ఉంటే బాహుబలి మొదటి పార్ట్ తర్వాత రానా సెకండ్ పార్ట్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఈ గ్యాప్ లో రానా సోలో హీరోగా సినిమాలు చేయాలనుకొని ఇప్పటికే రెండు సినిమాలకు సైన్ చేసాడు. అందులో ఒకటి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేయనున్న ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్.
ఇది కాకుండా సంకల్ప్ అనే రైటర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఇండియన్ నావీ, సబ్ మెరైన్ కాన్సెప్ట్ మీద ఓ సినిమా చేయనున్నాడు. రానా తాజాగా తీసుకున్న నిర్ణయం ఏమిటంటే.. బాహుబలి పార్ట్ 2 షూటింగ్ లో రానాకి సంబందించిన పార్ట్ ని ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టనున్నారు. దాంతో మూడున్నర నెల సమయందొరికింది. దాంతో ఈ గ్యాప్ లో రానా రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్ళి ఫిబ్రవరి లోపు ఫినిష్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు అటు ఇటుగా దసరా కానుకగా ప్రారభించే ఆలోచనలో ఉన్నారు. బాహుబలి లాంటి సినిమాని ప్రారంభించాక రానాకి టైం దొరకదు కాబట్టి ఒక సినిమా అన్నా చేయాలి అనుకోవడం తప్పులేదు. కానీ ఈ మూడున్నర నెలలో రెండు సినిమాలు పూర్తి చేయాలనుకోవడం కాస్త రిస్క్ తో కూడుకున్న పనే.. మరి రానా ఎలా మేనేజ్ చేసి సినిమాని ఫినిష్ చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

