ఇంటర్వ్యూ : ప్రాగ్య జైస్వాల్ – నా సినిమా గురువు ‘క్రిష్’.

ఇంటర్వ్యూ : ప్రాగ్య జైస్వాల్ – నా సినిమా గురువు ‘క్రిష్’.

Published on Oct 21, 2015 4:17 PM IST

Pragya
‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ ప్రాగ్య జైశ్వాల్ లక్కీ ఛాన్స్ కొట్టేసి చేసిన సినిమా ‘కంచె’. టాలీవుడ్ గర్వించదగ్గ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో ప్రాగ్య ఓ ప్రిన్సెస్ రోల్ లో కనిపించింది. కంచె సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కంచె సినిమా లో తను చేసిన సీతాదేవి ఎలా ఉండబోతుంది., కంచె విశేషాలను తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) అసలు ‘కంచె’ సినిమాలో ఆఫర్ ఎలా వచ్చింది.?
స) క్రిష్ గారి డైరెక్షన్ లో వచ్చిన ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమా హీరోయిన్ ఆడిషన్స్ కి నేను వెళ్లాను. అప్పుడే నా ఫోటోషూట్ క్రిష్ కి నచ్చింది. కానీ ఆ సినిమాకి కుదరలేదు. కానీ కంచె అనుకున్నప్పుడు నన్ను గుర్తుపెట్టుకొని పిలిచారు. ఈ సినిమా కోసం నేను సరిపోతానా లేదా అని ఆడిషన్ చేసి, పర్ఫెక్ట్ అనుకున్నాకే ఫైనల్ చేసారు.

ప్రశ్న) కంచెలో మీ పాత్ర గురించి చెప్పండి.?
స) కంచె సినిమాలో నేను రాజకొండ సీతాదేవి అనే పాత్రలో కనిపిస్తాను. 1930లో ఉన్న ఒక జమిందార్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఒక ప్రిన్సెస్ లాంటి పాత్ర అని చెప్పచ్చు. చాలా అందమైన అమ్మాయి, కానీ తనకి ఒక విషయం కరెక్ట్ అనిపిస్తే ఇక ఫ్యామిలీ కాదు కదా ప్రపంచం మొత్తం చెప్పినా వినదు. అలాంటి అమ్మాయి ప్రేమలో పడి, తన ప్రేమని దక్కించుకోవడం కోసం ఈ ప్రపంచంతో ఎలా పోరాడింది అన్నదే కథ.

ప్రశ్న) అలనాటి ప్రిన్సెస్ తరహా పాత్ర కోసం మీరేమేమి గ్రౌండ్ వర్క్ చేసారు.?
స) 1930లో జమిందార్ ఫ్యామిలీ అమ్మాయి అనగానే లుక్ మొత్తం మార్చాలి. ఇప్పటి అమ్మాయిలకి అప్పటి వారికి చాలా తేడా ఉంది. వారి మాట, లుక్, మానరిజమ్స్ అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. అదీ ప్రిన్సెస్ అనగానే వేరేలా ఉంటుంది. క్రిష్ గారు ఒకటే చెప్పారు.. నాకు నీలో ఒక ప్రిన్సెస్ లో ఉండే మానరిజమ్స్ కావాలి అన్నారు. దానికోసమే చాలా ఇంగ్లీష్, హిందీ భాషల్లో వచ్చినే ప్రిన్సెస్ తరహా సినిమాలు అన్నీ చూసాను. ఆ మానరిజమ్స్ ని ఫాలో అయ్యాను, ఇక క్రిష్ ఇచ్చిన సూచనలు నా పాత్ర పర్ఫెక్ట్ గా రావడానికి సాయం చేసాయి.

ప్రశ్న) మెగా హీరో వరుణ్ తేజ్ తో పనిచేయడం ఎలా ఉంది.?
స) మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో ఎలా ఉంటారో అని మొదటి రోజు సెట్లోకి వెళ్లాను. కానీ వరుణ్ లో పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను అన్న పొగరు అస్సలు లేదు. చాలా ఫ్రెండ్లీగా ఉంటూ అందరితో కలిసిపోతూ సరదగా ఉంటాడు. అలాగే చాలా టాలెంట్ ఉన్న హీరో. ఎందుకంటే అతనికి రిహార్సల్స్ అవసరం లేదు. మాతో మాట్లాడుతూనే ఉంటాడు షాట్ ఓకే అనేగానే వెళ్లి ధనాధన్ అని చేసుకొని వచ్చేస్తాడు. నేనైతే షాక్ అయ్యేదాన్ని. వరుణ్ లో యాక్టర్ ని పక్కన పెడితే హీ ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్.

ప్రశ్న) డైరెక్టర్ క్రిష్ తో వర్క్ చేయడం ఎలా ఉంది. యాక్టర్ గా క్రిష్ నుంచి ఏం నేర్చుకున్నారు.?
స) క్రిష్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే హీ ఈజ్ టాస్క్ మాస్టర్. తనకి అనుకున్నది వచ్చే దాకా అస్సలు వదలడు. ఒక నటిగా, సినిమా టెక్నికాలిటీస్ పరంగా నేను ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నటిగానే కాదు ఒక వ్యక్తిగా కూడా చాలా నేర్చుకున్నాను. ప్రతి విషయంలోనూ నాకు చాలా నేర్పించారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక్క మాటలో చెప్పాలంటే నా వరకూ నా సినిమా గురువు క్రిష్.

ప్రశ్న) మీ మొదటి సినిమా ఫ్లాప్, దాని నుంచి ఏం నేర్చుకున్నారు. అలాగే ఈ సినిమా నుంచి ఏం ఆశిస్తున్నారు.?
స) సినిమా ఫ్లాప్ అయ్యుండచ్చు కానీ ఓక యాక్టర్ గా నేను అయితే ఫెయిల్ కాలేదనే దాన్ని నేను నమ్ముతాను. నా ప్రతి సినిమా నాకో లెసన్ లాంటిది. ప్రతి సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాను. దాని ద్వారా నటిగా నేను ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాను. అలా అన్నిటిని నుంచీ నేర్చుకున్న దానివల్లే నాలోని బెటర్ యాక్టర్ ని కంచెలో చూస్తారు. కంచె నుంచి ఏమి ఆశిస్తున్నాను అంటే కచ్చితంగా ఈ సినిమా ఓ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను.

ప్రశ్న) కంచె సినిమా చేస్తున్న టైంలో మీకు బాగా టఫ్ అనిపించిన మోమెంట్స్ గురించి చెప్పండి.?
స) బాగా కష్టం అనిపించిన సీన్స్ చాలానే ఉన్నాయి. ఒకటి రెండు చెప్తా.. ఇందులో వర్షంలో చేసే సీన్ ఒకటి ఉంటుంది. క్రిష్ సీన్ అయ్యేంతవరకూ కళ్ళు బ్లింక్ చేయకూడదు అలా చేస్తే ఆడియన్స్ సీన్ నుంచి డిస్కనక్ట్ అవుతారని చెప్పాడు. నేను పైకి చూస్తూ డైలాగ్ చెప్పాలి. డైరెక్ట్ గా వాన చినుకులు పడుతున్నా కళ్ళు మూయకుండా ఆ సీన్ చెయ్యాలి. అది చాలా టఫ్.. అలాగే దేవుడి మీద ఒక సాంగ్ చేస్తున్నాం, అక్కడ మొత్తం రాళ్లు రప్పలు ఉన్నాయి, అలాంటి ప్లేస్ లో చెప్పులు వేసుకోకుండా అక్కడ డాన్స్ చేయడం చాలా కష్టంగా అనిపించింది.

ప్రశ్న) మెగా ఫ్యామిలీ నుంచి కాంప్లిమెంట్స్ ఏమన్నా వచ్చాయా.?
స) మొదటి రోజు సెట్లో నన్ను చూసిన నాగబాబు గారు ఈ అమ్మాయి రియల్ ప్రిన్సెస్ లాగే ఉందని కితాబులిచ్చాడు. అలాగే సినిమాలో రషెష్ చూసాక ఆయనకి అలనాటి కాంచన గారు గుర్తొచ్చారని చెప్పారు. ఆ లెజండ్రీ యాక్టర్ తో నేను పోల్చుకోలేను, కానీ కాంప్లిమెంట్ మాత్రం మర్చిపోలేనిది. ఆడియో లాంచ్ లో రామ్ చరణ్ కొన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మీగతా మెగా ఫ్యామిలీ మెంబర్స్ ని నేను కలవలేదు కానీ వారు కూడా నాకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారని వరుణ్ చెప్పాడు.

ప్రశ్న) కంచె తర్వాత వేరే ఏదన్నా తెలుగు సినిమాకి కమిట్ అయ్యారా.?
స) ప్రస్తుతం కొన్ని చర్చల దశలో ఉన్నాయి. కొన్ని సినిమాలను ఫైనలైజ్ చేసే టైంలో ఈ సినిమాని వెంటనే రిలీజ్ చేస్తున్నారని చెప్పగానే అవి పక్కన పెట్టి ప్రమోషన్స్ కోసం ఇటొచ్చాను. సినిమా రిలీజ్ అయ్యాక వాటిని ఫైనల్ చేస్తాను. ఒకేసారి తెలుగు, హిందీలో చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. అతి త్వరలోనే తెలుగు ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు