త్రివిక్రమ్ ‘అ..ఆ..’ షూట్‌లో జాయిన్ అయిన సమంత

త్రివిక్రమ్ ‘అ..ఆ..’ షూట్‌లో జాయిన్ అయిన సమంత

Published on Oct 22, 2015 1:00 PM IST

Samantha-

మాటలతో మ్యాజిక్ చేసి కట్టిపడేసే దర్శక రచయిత త్రివిక్రమ్, రొమాంటిక్ కామెడీలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో నితిన్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ‘అ..ఆ..’ అన్న టైటిల్, అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అన్న ఇంటరెస్టింగ్ ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ సినిమాపై అనౌన్స్ అయిన రోజునుంచే మంచి అంచనాలు బయలుదేరాయి. నితిన్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 16న రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది.

కాగా ఈ ఐదు రోజులు హీరో నితిన్ నేపథ్యంలో పలు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించగా, రేపట్నుంచి సమంత కూడా సెట్లో జాయిన్ కానున్నారు. అ..ఆ.. టీమ్‌తో షూటింగ్‌లో జాయిన్ అవుతున్నందుకు హ్యాపీగా ఉందని సమంత ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగులతో కూల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న అ..ఆ.. సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది.

తాజా వార్తలు