యుఎస్ లో కలెక్షన్స్ అదరగొడుతున్న ‘కంచె’

యుఎస్ లో కలెక్షన్స్ అదరగొడుతున్న ‘కంచె’

Published on Oct 26, 2015 11:01 AM IST

Kanche

మునుపెన్నడూ వెండితెరపై చూడని కథాంశంతో వచ్చి, తెలుగు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించిన క్రేజీ సినిమా ‘కంచె’. ఈ సినిమా దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ లాంటి సినిమాలతో తెలుగులో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు క్రిష్ తన కంచె సినిమానూ తనదైన బ్రాండ్‌తో రెండో ప్రపంచయుద్ధ నేపథ్యానికి ఓ ప్రేమకథను జోడించి క్రిష్ తెరకెక్కించారు. వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి చూసిన ప్రతి ఒక్కరి నుంచీ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

అబ్బురపరిచే వరల్డ్ వార్ II సీన్స్, వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్, సాయి మాధవ్ బుర్రా రాసిన కదిలించే డైలాగ్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు 1940 కంటెంట్ ని గా ప్రెజంట్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. కంచె సినిమాకి క్లాస్ ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ రావడమే కాకుండా రోజు రోజుకీ కలెక్షన్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో రోజు రోజుకీ ఈ సినిమాకి కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి మూడు రోజుల్లోనే 2 కోట్ల షేర్ మార్క్ నిక్రాస్ చేసింది. మొదటి మూడు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్స్ లాభాలను అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. యుఎస్ బాక్స్ ఆఫీసు పూర్తి కలెక్షన్ రిపోర్ట్ మీ కోసం..

రోజు కలెక్షన్స్(డాలర్స్ లో)
బుధవారం(ప్రీమియర్స్) $53,057K
గురువారం $46,751K
శుక్రవారం $92,998K
శనివారం $120,647K
మొత్తం $319,937 (2.08 కోట్లు)

తాజా వార్తలు