రత్నవేలు.. ‘ఆర్య’, ‘జగడం’, ‘1 నేనొక్కడినే’ సినిమాలతో పాటు తమిళంలో ‘రోబో’ లాంటి విజువల్ వండర్‌ను అందించిన సినిమాటోగ్రాఫర్. 1 నేనొక్కడినే సినిమాలో లైటింగ్‌తో పెద్ద ప్రయోగాలే చేసిన రత్నవేలు, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ నటిస్తోన్న బ్రహ్మోత్సవం సినిమాకు పనిచేస్తున్నారు. ఇక సుకుమార్ నిర్మాణంలో, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ‘కుమారి 21F’ సినిమా రేపు (నవంబర్ 20న) పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సుకుమార్ ఫ్రెండ్షిప్ కోసమే ‘కుమారి 21F’ బాధ్యతగా తీసుకొని చేశానని తెలిపిన రత్నవేలు, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ‘రోబో 2’ సినిమాకు తాను ఎందుకు పనిచేయడం లేదనే విషయమై స్పష్టతనిచ్చారు.
‘రోబో’ను మించేలా ‘రోబో 2’ను తెరకెక్కించాలని దర్శకుడు శంకర్ భారీ ఎత్తున ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇక రోబోకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన రత్నవేలునే రోబో 2 కోసం కూడా సంప్రదించగా ఆయన నో చెప్పారు. ఈ విషయం గురించే మాట్లాడుతూ.. “ప్రస్తుతం మహేష్ బ్రహ్మోత్సవం సినిమాతో బిజీగా ఉన్నా. ఈ సినిమా సెట్స్‌పై ఉన్న ఈ సమయంలోనే రోబో 2 అవకాశం కూడా వచ్చింది. అయితే ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశనుంచే సినిమాతో పాటే ట్రావెల్ అవ్వాలి. నేను ఒకేసారి రెండు సినిమాలకు పనిచేయలేను. పూర్తిగా ఒకే సినిమాకు అంకితమై పనిచేస్తుంటా. దాంతో రోబో 2ను వదులుకోవాల్సి వచ్చింది” అని తెలిపారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న బ్రహ్మోత్సవం సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కానుంది.


