జనవరి నెలాఖర్లో త్రిష ‘నాయకి’?

జనవరి నెలాఖర్లో త్రిష ‘నాయకి’?

Published on Nov 22, 2015 7:00 PM IST

Trisha1
తెలుగు, తమిళం, హిందీ ఇలా ఏ భాష అనేది సంబంధం లేకుండా అన్ని భాషల్లో స్టార్‌డమ్ సంపాదించుకున్న నటి త్రిష. ఇండస్ట్రీకి వచ్చి పదమూడేళ్ళైనా ఇప్పటికీ అదే ఉత్సాహంతో వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోన్న త్రిష, ‘నాయకి’ పేరుతో ఓ హర్రర్ కామెడీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమాకు గోవి దర్శకుడు. హర్రర్ కామెడీకి తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా ఆ కోవలో ఓ మంచి సినిమాగా నిలుస్తుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు త్రిష.

ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి రేకెత్తించగా, ఆ పోస్టర్స్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో హ్యాపీ అయిన టీమ్ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఇక జనవరి నెలాఖర్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే నెలలో త్రిష నటిస్తోన్న మరో సినిమా అరన్‌మనై 2 కూడా విడుదల కానుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు