
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో సీత పాత్రతో మెప్పించి తెలుగు ప్రేక్షకుల ఇంట్లో అమ్మాయిలా పేరు తెచ్చుకున్న నటి అంజలి. ఆ తర్వాత తెలుగులో బాగా పాపులర్ అయిపోయిన అంజలి వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూనే, మరోవైపు పలు ఆసక్తికర కథాంశాలతో రూపొందుతోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలలోనూ నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. ప్రస్తుతం అంజలి ఓ ముఖ్య పాత్ర పోషించిన ‘శంకరాభరణం’ డిసెంబర్ 4 న రిలీజ్ కానుంది. అది కాకుండా బాలయ్యతో ‘డిక్టేటర్’ మరియు ‘చిత్రాంగద’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా అంజలి దగ్గరికి మరో లేడీ ఓరియెంటెడ్ కథ వెళ్ళింది. ‘మిస్సమ్మ’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకొని గత ఏడాది ‘మాయ’ అంటూ తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నీలకంఠ ఓ డిఫరెంట్ లేడీ ఓరియెంటెడ్ కథని సిద్దం చేసాడు. అందులో అంజలి అయితే పర్ఫెక్ట్ అని తనని అప్రోచ్ అయ్యాడు. ప్రస్తుతం అంజలి ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కానీ నీలకంఠ కథపై ఆసక్తిగానే ఉందని సమాచారం. ఒక్కసారి అంజలి పచ్చ జెండా ఊపితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడుతుంది.

