ఆసక్తి రేకెత్తించిన గౌతమ్ మీనన్ ప్రయోగం!

ఆసక్తి రేకెత్తించిన గౌతమ్ మీనన్ ప్రయోగం!

Published on Nov 24, 2015 10:11 PM IST

naga-chaithanya-gautham-men
నాగ చైతన్య హీరోగా క్లాస్ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’ అనే ఓ కూల్ యాక్షన్ లవ్‌స్టోరీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘ఏ మాయ చేశావే’ మ్యాజిక్ కాంబినేషన్ అయిన నాగ చైతన్య, గౌతమ్ మీనన్‌లు కలిసి చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాకు మొదట్నుంచే విపరీతమైన క్రేజ్ కనిపించింది. ఇక ఆ క్రేజ్‌కు తగ్గట్టుగానే ఇప్పటివరకూ విడుదలైన రెండు టీజర్లూ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మొదటి టీజర్లో ‘ఏ మాయ చేశావే’ లాంటి కూల్ లవ్‌స్టోరీ ఫ్లేవర్ కనిపించి మెప్పిస్తే, కొత్త టీజర్‌లో స్టైలిష్ యాక్షన్ ఫ్లేవర్‌తో మెప్పించారు.

నాగ చైతన్య బర్త్‌డే సందర్భంగా నిన్న విడుదలైన ఈ టీజర్‌లో గౌతమ్ మీనన్ చేసిన ఓ ప్రయోగం మాత్రం ఆయన అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. గౌతమ్ మీనన్ వాయిస్ ఓవర్‌తో మొదలయ్యే ఈ టీజర్‌లో ఎక్కడా బ్యాక్‌గ్రౌడ్ మ్యూజిక్ అనేదే వాడకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. పూర్తిగా పరిసరాల సౌండ్స్, ఆంబియన్స్‌ సౌండ్‌నే వాడుకొని ఈ టీజర్‌ను రూపొందించారు. ఏ.ఆర్.రెహమాన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చెబుతూ, అందుకు తగ్గట్టుగా మొదటి టీజర్‌ను రెహమాన్ బ్రాండ్‌తో నింపి, ఇప్పుడు ఈ ట్రైలర్‌ను ఇలా విడుదల చేయడం అంతటా ఆసక్తి రేకెత్తించింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జనవరి నెలాఖర్లో విడుదల చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు