నైజాంలో అదరగొడుతున్న ‘కుమారి 21F’ కలెక్షన్స్

నైజాంలో అదరగొడుతున్న ‘కుమారి 21F’ కలెక్షన్స్

Published on Nov 25, 2015 3:20 PM IST

Kumari21f
టిపికల్ లవ్ స్టోరీస్ తీసే టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ ని స్థాపించి, నిర్మాతగా మారి తనే కథ – స్క్రీన్ ప్లే అందించి చేసిన సినిమా ‘కుమారి21F’. తెలుగుకు పెద్దగా పరిచయం లేని బోల్డ్ కాన్సెప్ట్ తో, గ్లామర్ ని కాస్త ఎక్కువగా ఒలకబోయించి చేసిన ‘కుమారి 21F’ సినిమాకి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ – హేభ పటేల్ జంటగా నటించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

ఓవరాల్ గా కుమారి 21F అనే సినిమా రాజ్ తరుణ్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలుస్తుందని అన్ని ఏరియాల ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయని ఇదివరకే తెలియజేశాం. తాజాగా మేము నైజాంలో కలెక్షన్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోగా.. మొదటి 5 రోజుల్లో 2.5 కోట్ల షేర్ మార్క్ ని క్రస్ చేసిన ఈ సినిమా ఓవరాల్ గా ఒక్క నిజాం లోనే 5.5 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేస్తుందని తెలిపారు. మూడావ్ సినిమాకే రాజ్ తరుణ్ కి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అనేది మామూలు విషయం కాదని ట్రేడ్ వర్గాలు అవక్కయ్యాయి. మరోవైపు ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల నిర్మాతలు పోటీ పడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు