తమిళంలో క్రేజీగా మారిన గోపీచంద్ విలన్!

తమిళంలో క్రేజీగా మారిన గోపీచంద్ విలన్!

Published on Nov 25, 2015 10:14 PM IST

Kabir-Duhan-Singh
కబీర్ సింగ్.. గోపీచంద్ హీరోగా నటించిన ‘జిల్’ సినిమాతో విలన్‌గా పరిచయమైన ఈ నటుడు అతికొద్దికాలంలోనే సౌత్‌లో క్రేజీగా మారిపోయారు. జిల్ సినిమా ఓ మోస్తారు విజయం సాధించగా, అందులో విలన్‌గా నటించిన కబీర్‌కు మాత్రం ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో స్టైలిష్‌ విలన్‌గా మెప్పించిన కబీర్, ఆ తర్వాత బాలకృష్ణ ‘డిక్టేటర్’, నారా రోహిత్ ‘తుంటరి’ లాంటి సినిమాల్లో విలన్‌గా నటించారు. ఇక ఈ మధ్యే విడుదలై తమిళంలో సూపర్ హిట్ కొట్టిన అజిత్ ‘వేదాళం’ కబీర్ సింగ్ కెరీర్‌ను మరో ఎత్తుకు తీసుకెళ్ళింది.

దీపావళి కానుకగా తమిళనాట పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా అజిత్ కెరీర్‌కు మరో సూపర్ హిట్ తెచ్చిపెట్టి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ విజయం తర్వాత కబీర్ సింగ్ తమిళంలో స్టార్ విలన్‌గా మారిపోయారు. కబీర్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్‌కు తమిళ ప్రేక్షకుల దగ్గర్నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే కబీర్‌కు తమిళ దర్శకుల నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు టాప్ హీరోల సినిమాలకు కబీర్‌ను దర్శక నిర్మాతలు సంప్రదిస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు