సిద్ధార్థ్, త్రిషల సినిమా షూటింగ్ పూర్తి

సిద్ధార్థ్, త్రిషల సినిమా షూటింగ్ పూర్తి

Published on Dec 1, 2015 5:33 PM IST

trish
సిద్ధార్థ్‌, త్రిష, హన్సిక ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా తమిళంలో ‘అరన్‌మనై 2’ పేరుతో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. హన్సిక లీడ్ రోల్‌లో నటించిన హర్రర్ కామెడీ ‘అరన్‌మనై’ (తెలుగులో చంద్రకళ)కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. హర్రర్ కామెడీకి తెలుగు, తమిళ భాషల్లో సూపర్ క్రేజ్ కనిపిస్తోన్న నేపథ్యంలో అరన్‌మనై 2 తమిళ నాట క్రేజీ ప్రాజెక్టుగానే కనిపిస్తోంది. ‘చంద్రకళ’ సినిమాకు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చినందున ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాను ఇక్కడ కూడా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం నేటితో పూర్తైంది. ‘యువ’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తర్వాత సిద్ధార్థ్, త్రిషల కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా ఇప్పటికే మంచి అంచనాలను రేకెత్తించింది. ఇక షూటింగ్ పూర్తయిందన్న విషయాన్ని తెలియజేస్తూ సిద్ధార్థ్, త్రిషతో మళ్ళీ కలిసి నటించడం ఆనందంగా ఉందని తెలిపారు. పొంగల్ కానుకగా జనవరి రెండో వారంలో ఈ సినిమా విడుదల కానుందని సిద్ధార్థ్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఇక 103 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక క్లైమాక్స్ సాంగ్‌ను షూట్ చేయడం ఈ సినిమా విషయంలో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు