ఎన్.టి.ఆర్ ‘జనత గ్యారేజ్’కి షూట్ డేట్ ఫిక్స్

ఎన్.టి.ఆర్ ‘జనత గ్యారేజ్’కి షూట్ డేట్ ఫిక్స్

Published on Dec 7, 2015 9:58 PM IST

NTR-Nanaku-prematho
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కెరీర్ కి హో ప్రతిష్టాత్మకంగా మారిన 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జోరుగా సాగుతోంది. ఈ నెల మూడవ వారం వరకూ అక్కడ షూటింగ్ జరుపుకొని రానున్న ఈ చిత్ర టీం మిగిలిన చిన్న చిన్న పార్ట్స్ ని ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయనుంది. ఈ సినిమాని పక్కన పెడితే ఎన్.టి.ఆర్ ఇప్పటికే కొరటాల శివతో తన తదుపరి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా అధికారికంగా లాంచ్ కూడా చేసాడు. ఆ సినిమాకి జనత గ్యారేజ్ అనే టైటిల్ ని కూడా అనుకుంటున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఎప్పటి నుంచి సెట్స్ పైకి వెల్లనుందనే విషయం మాకు తెలిసింది. నాన్నకు ప్రేమతో షూటింగ్ పూర్తయిన తర్వాత ఓ వారం పది రోజులు గ్యాప్ తీసుకొని, ఈ టైంలో తన లుక్ మార్చుకొని కొరటాల శివ ‘జనత గ్యారేజ్’ మొదలు పెట్టడానికి సిద్దమయ్యాడట. ఎక్కువ భాగం సంక్రాతికి ముందే జనవరి 8 నుంచే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఎన్.టి.ఆర్ ఉన్నట్టు సమాచారం. ఈ సినిమా లాంచ్ రోజునే ఈ సినిమాని ఆగష్టు 12న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయడం వలన ఎన్.టి.ఆర్ షూటింగ్ అస్సల ఆలస్యం అవ్వకూడదని భావించి ఈ టైంని ఫిక్స్ చేసినట్లు సమాచార.మరోవైపు సంక్రాంతి టైంకే నాన్నకు ప్రేమతో సినిమాని కూడా రిలీజ్ చేసేలా ఎన్.టి.ఆర్ ప్లాన్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు