మరో సినిమాకి సైన్ చేసిన సునీల్??

మరో సినిమాకి సైన్ చేసిన సునీల్??

Published on Dec 13, 2015 4:47 PM IST

sunil

కమెడియన్ నుంచి కామెడీ హీరోగా, కామెడీ హీరో నుంచి మాస్ హీరోగా ప్రమోషన్ తీసుకున్న సునీల్ హీరోగా నటించిన ‘కృష్ణాష్టమి’ సినిమా జనవరిలో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఇది కాకుండా ప్రస్తుతం సునీల్ వంశీకృష్ణ ఆకెళ్ళ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమాలో మన్నారా చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం సునీల్ మరో సినిమాకి సైన్ చేసాడు. అది కూడా కామెడీ మరియు యాక్షన్ ని పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి చెప్పగల వీరూ పొట్ల డైరెక్షన్ లో అని సమాచారం.

ఇటీవలే వీరూ పొట్ల సునీల్ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కథతో ఓ కథని రెడీ చేసి వినిపించాడట. ఆ కథ సునీల్ కి బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సునీల్ ప్రస్తుతం చేస్తున్న వంశీకృష్ణ సినిమా పూర్తవగానే వీరూ పొట్ల సినిమా మొదలవుతుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. సునీల్ వరుసగా సినిమాలు సైన్ చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ హిట్స్ అందుకునేలా ప్లాన్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు