నాగార్జున ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో ఆఫీసర్ సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా పూర్తి అవ్వగానే శ్రీ రామ్ఆదిత్య దర్శకత్వంలో మల్టిస్టారర్ సినిమాలో నటించబోతున్నాడు ఈ హీరో. నాని ఈ సినిమాలో డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. తాజా సమాచారం మేరకు నాగార్జున సరసన అమల పాల్ హీరోయిన్ గా నటించబోతోందని తెలుస్తోంది.
అయితే ఇప్పటి వరుకు ఈ వార్తపై అధికారిక ప్రకటన లేదు. త్వరలో ఈ న్యూస్ ఆఫిషియల్ కాబోతోందని తెలుస్తోంది. మని శర్మ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. గతంలో అమలా పాల్ ‘నాయక్, ఇద్దరమ్మాయిలతో’ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ నెల 18 నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.


