కొంతమంది తెలుగు దర్శకులకు స్పెషల్ షో !

కొంతమంది తెలుగు దర్శకులకు స్పెషల్ షో !

Published on Mar 25, 2018 5:23 PM IST

మంచి సినిమాలు, హృదయానికి హత్తుకొనే సినిమాలు తరుచుగా వస్తుంటాయి. అలాంటి సినిమాల్లో నీది నాది ఒకే కథ ఒకటి. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు పొందింది. ఈ సినిమా స్పెషల్ షో ఈరోజు కొంతమంది దర్శకులకు వెయ్యబోతున్నారు. సీనియర్ దర్శకులు ఈ షో కు హాజరు కానున్నట్లు సమాచారం.

ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వేణు ఉడుగులకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చెయ్యబోతున్నారు. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ అయ్యింది. శ్రీ విష్ణు నటనకు ఈ సినిమాతో మరింత గుర్తింపు లభించింది.

తాజా వార్తలు