
మహేష్ నటించిన ‘భరత్ అనే నేను’ నుండి మూడవ పాటగా ‘వచ్చాడయ్యో సామి’ నిన్న సాయంత్రం విడుదలైంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం కలిసి ఉన్నతంగా ఉన్న ఈ పాట సంగీత ప్రియులను, మహేష్ అభిమానులను బాగా ఆకట్టుకుంటూ ఇన్స్టెంట్ హిట్ గా నిలిచింది.
ఇప్పటి వరకు పాటకు 2 మిలియన్ల వ్యూస్ దక్కడం విశేషం. ఈ చిత్రం యొక్క పూర్తి పాటలను రేపు జరగనున్న ఆడియో వేడుకలో రిలీజ్ చేయనున్నారు. ఈ వేడుకకు జూ.ఎన్టీఆర్ అతిధిగా హాజరుకానున్నారు. శివ కొరటాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న విడుదలచేయనున్నారు. దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కైరా అద్వానీ కథానాయకిగా కనిపించనుంది.

